సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫైటర్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. దీపిక పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. పఠాన్, వార్ లాంటి సినిమాలు చేసిన డైరక్టర్‌గా సిద్ధార్థ్ ఆనంద్కి మంచి పేరు ఉంది. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఫైటర్ మూవీని చూడటానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు జనాలు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఫైటర్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలను రివీల్ చేశారు సిద్ధార్థ్.
ఆయన మాట్లాడుతూ ``ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆయనతో పాటు దీపిక కూడా అదే పొజిషన్లో ఉంటారు. 2024లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్లాన్. రియాలిటీని, ఆథంటిసిటీని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నాం. దీపిక ఇదివరకు ఎప్పుడూ చేయని పాత్రలో కనిపిస్తారు. ఆమె నిజజీవితంలో ఎలా ఉంటారో, తెరమీద కూడా ఈ సినిమాలో చాలా వరకు అలాగే కనిపిస్తారు. సెట్లో చాలా ఫన్ అనిపించేది. నేను చెప్పిన పాత్రను అర్థం చేసుకుని, అద్భుతంగా కెమెరా ముందు ఆవిష్కరించారు. ఈ సినిమా విడుదల కోసం, నేను, ఫ్యాన్స్ మాత్రమే కాదు, దీపిక కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు`` అని అన్నారు. పఠాన్‌కీ, ఫైటర్కీ చాలా వైవిధ్యం ఉందని అన్నారు సిద్ధార్థ్. దీని గురించి మాట్లాడుతూ ``ఫైటర్ని ఏ సినిమాతోనూ పోల్చలేం. దాని ప్రత్యేకత దానిదే. పఠాన్ తర్వాత ఫైటర్ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. పఠాన్‌తో బెంచ్‌మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ని క్రియేట్ చేశాం.
ఫైటర్ అంతకు మించి ఉంటుంది. దానికి తగ్గట్టే రూపొందించాం.ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది ఫైటర్`` అని అన్నారు. ఫైటర్‌లో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఫైటర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ఇనిషియల్ ప్లాన్. కానీ ఇప్పుడు డేట్ పోస్ట్ పోన్ అయింది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డేకి పఠాన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఫైటర్‌తో పాటు ప్రాజెక్ట్ కెలోనూ అద్భుతమైన పాత్రలో నటిస్తున్నారు దీపిక పదుకోన్.